[spt-posts-ticker]
Malaysia,India, without Visa visit

ఇకపై మలేషియాకు వీసా లేకుండానే ప్రయాణం!

ఇండియన్స్ కు మలేషియా శుభవార్త
ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకుంటే వెళ్లి వచ్చే సదుపాయం
ఉత్తర్వులు జారీ చేసిన మలేషియా

మలేషియాకు వెళ్లాలని భావించే భారతీయులకు శుభవార్త. ఇకపై ఎటువంటి వీసాను తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లి రావచ్చు. ఇంతవరకూ ముందుగా వీసా తీసుకుని మాత్రమే మలేషియాకు వెళ్లే వీలుండగా, ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్టు మలేషియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ మోహన్‌, ఇకపై ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకుని మలేషియాలో పర్యటించ వచ్చని తెలిపారు. నేపాల్, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లేలాగానే అక్కడికీ పోయి రావచ్చని అన్నారు. ఈ మేరకు భారత పౌరులకు సరికొత్త సౌలభ్యాన్ని మలేషియా సర్కారు కల్పించిందని అన్నారు.
Tags: Malaysia,India, without Visa visit

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *