[spt-posts-ticker]

అమెరికాలో క్షణక్షణానికి పెరుగుతున్న కరోనా మృతులు

వైరస్ బయటపడ్డాక ఒక్కరోజులో హయ్యెస్ట్ డెత్స్

జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ వెల్లడి

 బయటికెళ్లేటపుడు మాస్క్ పెట్టుకోండి: ట్రంప్

అమెరికాలో కరోనా ప్రభావం చాలాఎక్కువగా ఉంది. బాధితుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుండడంతో పాటు పెద్దసంఖ్యలో జనాలు చనిపోతున్నరు. గురు, శుక్ర వారాల్లో(24 గంటల వ్యవధిలో) దాదాపు 1500 మంది చనిపోయారని జాన్ హాప్కిన్స్ యూని వర్సిటీ ట్రాకర్ వెల్లడించింది. వైరస్ బయటపడ్డప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క రోజులో రికార్డైన అత్యధిక మరణాలు ఇవేనని పేర్కొంది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 562 మంది చనిపోయారని తెలిపింది. గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల వరకు మొత్తం 1480 మంది చని పోయినట్లు వివరించింది. దీంతో శనివారానికి అమె రికాలో కరోనా మృతుల సంఖ్య 8,154కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 33 వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,432కు చేరింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బయటికెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది కేవలం సూచన మాత్రమేనని, మాస్క్ పెట్టుకోవాలా వద్దా అనేది ఎవరికి వారే నిర్ణ యించుకోవచ్చని చెప్పారు. తాను మాత్రం మాస్క్ పెట్టుకోవద్దని అనుకుంటున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో సైన్యం పాత్రను మరింత పెంచనున్నట్లు ట్రంప్ తెలిపారు. కంటికి కనిపించని శత్రువుపై పోరాడేందుకు ఎవరూ ప్రిపేరై లేకపోవడంతో ఆర్మీ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు వైరస్ దెబ్బకు అన్నిబిజినెస్లు కుదేలవడంతో మార్చి నెలలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారని, నిరుద్యోగిత 4.4 శాతం పెరిగిందని అమెరికాలేబర్ రిపోర్టు వెల్ల డించింది. రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది నిరుద్యోగులుగా మారారని పేర్కొంది. దేశంలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా మరి కొంతమంది ఖైదీలను విడుదల చేయాలని యూఎస్ అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. నేరాల తీవ్రత ఆధారంగా ఖైదీలను విభజించి , ఇంట్లోనే నిర్భందించే వీలున్న వారిని బయటికి పంపించాలని అన్నారు. విడుదలైన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్ కు మార్చాలని సూచించారు. కరోనా బారినపడి వివిధ జైళ్లలో ఐదుగురు ఖైదీలు మరణించడంతో ఈ నిరయ్ణం తీసుకున్నట్లు సమాచారం.

హైడ్రాక్సిక్లోరోక్విన్తో రిజల్ట్ బాగుంది

కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో మలేరియా డ్రగ్హై డ్రాక్సిక్లోరోక్విన్ మంచి ఫలితాలనుఇస్తోందని ట్రంప్ చెప్పారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మిలియన్ల కొద్దీ డోసులను రెడీ చేసిపెట్టినట్లు తెలిపారు. వైరస్ ను ఎదుర్కోవడానికి ఈ డ్రగ్ తో పాటు ఇతర విధానా లను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తామని చెప్పారు.

ఓటర్ ఐడీనే బెస్ట్

ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఎలాంటి ఆటంకంలేకుండా జరుగుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలను పోస్ట్ పోన్ చేసే పరిస్థితి రాదని అన్నారు. ఈ ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలన్న వాదనను కొట్టేశారు. చీటింగ్ కు అవకాశం ఉంటుందని, ఓటర్ ఐడీ విధానమే బెటర్ అని ట్రంప్ చెప్పారు.

37 వేల మందిని తీసుకొచ్చాం

కరోనా ఎఫెక్ట్ తో బయటి దేశాల్లో చిక్కుకున్న 37 వేల మంది అమెరికన్ సిటిజన్లను ఇప్పటి వరకు దేశానికి తీసు కొచ్చా మని ట్రంప్ వివరించారు. ఇండియా సహా దక్షిణాసియా దేశాల్లోచిక్కుకున్న మరో 22 వేల మందిని తీసుకురావాల్సి ఉందన్నారు. ఇందుకోసం సుమారు 70 విమానాలను రెడీ చేస్తున్నట్లు తెలిపారు

జనాల రాకపోకలే కారణమా?

అమెరికాలో కరోనా తీవ్రంగా వ్యాపించడానికి కారణం చైనా, ఇటలీ, ఫ్రాన్స్ సహా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల రాకపోకల వివరాలను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని అంటున్నారు. వైరస్ ప్రభావం వెలుగుచూసిన తొలినాళ్లలో.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా దాదాపు 34 లక్షల మంది అమెరికాకు వచ్చారని ఈ లెక్కల్లోతేలింది. ఒక్క చైనా నుంచే 7.5 లక్షల మంది యూఎస్ రాగా, ఇటలీ నుంచి 3.4 లక్షల మంది, స్పెయిన్ నుంచి 4 లక్షలు, బ్రిటన్ నుంచి 19 లక్షల మంది వచ్చారని తేలింది. ఆయా దేశాల నుంచి న్యూయార్క్, లాస్ ఏంజిలిస్, సియాటెల్ తదితర పెద్దనగరాలలో అడుగుపెట్టి, తర్వాత వివిధ సిటీలతో పాటు ఎక్కడెక్కడికో వెళ్లా రని అధికారులు చెప్పారు. ఇలా వచ్చిన వారిలో ఎంతమంది వైరస్ బారిన పడ్డారో తెలియదని మెడికల్ ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు.

కాలిఫోర్నియాలో కరోనా కట్టడి..

న్యూయార్క్, కాలిఫోర్నియాలలో ఒకేసారి వైరస్ కేసులు బయటపడ్డాయి. తొలి నాళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య ఒకేలా ఉండేది. తర్వాత న్యూయార్క్లో పాజిటివ్ కేసులు, మరణాలు వేగంగా పెరిగాయి. కాలిఫోర్నియాలో మాత్రం వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో 12 వేల మందికి వైరస్ సోకగా.. న్యూయార్క్లో ఈ సంఖ్య లక్ష దాటింది. కాలిఫోర్నియా లో 264 మంది, న్యూయార్క్లో 2,935 మందిపైనే చనిపోయారు. కరోనా తీవ్రతను ముందే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం వల్లే ఇది సాధ్యమైందని కాలిఫోర్నియా గవర్నర్ చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *