[spt-posts-ticker]

ఎఎన్ఎం లతో కోవిడ్ పరీక్ష లు  చేయించాలనే నిర్ణయం విరమిచాలి

– తెలంగాణా మెడికల్&హెల్త్ ఎంప్లాయ్ యూనియన్ , ప్రధాన కార్యదర్శి(మహిళ విభాగం), బోడ అరుణ

హైదరాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఫిల్డ్ స్టాఫ్ ఎఎన్ఎం లు కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించడం సరైన విధానం కాదని కోవిడ్ పరీక్ష లు  చేయించాలనే నిర్ణయం విరమిచాలని తెలంగాణా మెడికల్&హెల్త్ ఎంప్లాయ్ యూనియన్ , ప్రధాన కార్యదర్శి(మహిళ విభాగం), బోడ అరుణ డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యజ్యోతితో మాట్లాడుతూ ఇప్పటికే ఎఎన్ఎం లకు పనిభారం  ఎక్కువగా ఉందిని, వైద్య ఆరోగ్య శాఖ లో అన్ని పనులు ఎఎన్ఎం లు చేయడంతో పనిభారం పెరుగుతుందన్నారు. మత శిశువు సంక్షేమం,గర్భిణి ల పరీక్షలు, HB శాతం,బీపీ,షుగర్ చూడండం,TT లు వేయడం,సుఖ ప్రసవం కోసం జాగ్రత్తలు చెప్పడం,డెలివరీ సమయంలో ఇబ్బందులు ఉంటే హాస్పిటల్స్ కు రెపరల్ చేయడం,పుట్టిన బిడ్డకు వ్యాది నిరోధక టీకాలు ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇప్పించడం,TB బాధితులకు, కుష్ఠు వ్యాధి గ్రస్థులకు మందులు పంపిణీ చేయడం,సబ్ సెంటర్ స్తాయిలో సమావేశం ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయి ,రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం లో విటమిన్లు, పుష్టికా హారం, జనాభా నియంత్రణ, లాంటి కార్యక్రమంలో పాల్గొనడం,గ్రామంలో జరిగే జనన,మరణాలను నమోదు చేయాలి, పాఠశాలలను,సందర్శించడం,గర్భిణిని ఇంటికి సందర్శించడం లాంటి అనేక పనులతో  సతమతమవుతున్నారు,కేత్ర స్థాయి లో అందుబాటులో ఉంటున్న ఎఎన్ఎం లను బలిపాశువులుగా చూస్తున్నారని తెలిపినారు. సబ్ సెంటర్ భవనం వుండదు, కిరాయి భవనం లో సబ్ సెంటర్ సెంటర్ వీటి కిరాయి ప్రభుత్వం ఇప్పుడో ఇస్తారో తెలవదన్న్నారు. ,ప్రతి బుధ,శని వారం నాడు PHC లకు వెళ్లి Vaccine తెచ్చుకోవాలి,vaccine రవాణా భత్యం కు బడ్జెట్ రాకపోవడం తో జీతం నుండే భరించాలని తెలిపినారు.ఇన్ని పనులతో ఇబ్బంది పడుతున్న ఎఎన్ఎం కరోనా టెస్టు చేయడం  వల్ల ఒక ఎఎన్ఎం కు వైరస్ సోకితే , ఎలాంటి లక్షణాలు లేకుండా అంతర్గతంగా కరోనా లక్షణాలతో ఉన్న ఎఎన్ఎం తన పనిలో భాగంగా చిన్నపిల్లలకు గర్భవతులకు UIP నిర్వహించినప్పుడు ,  గ్రామంలోని  వృద్దులకు ,NCD పేషెంట్లకు మందులు పంపిణీ చేసినప్పుడు వైరస్ వ్యాపిస్థుందనేది మనకు తెల్సిన సమాచారం .

  • ఎఎన్ఎం ల తో కరోనా టెస్టులు చేయించడం సమాజానికి అత్యంత ప్రమాదకరం.
  • ఈ పని చేయడానికి టెక్నికల్ గా ట్రైండ్ అయిన LT లను నియమించాలి .
  • వారి ద్వారా నే కరోనా పరీక్షలు చేయించాలి.
  • ఇదేదో ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోయే విషయం కాదు.  ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుందో ఎవరూ చెప్పలేము . దీర్ఘకాలికంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.               తొందరపడి
  • ఈ పని ఎఎన్ఎం లతో చేయించి తాత్కాలికంగా ప్రభుత్వం టెస్టులు చేస్థుందని చెప్పకోవడం కోసం చేస్తే, ప్రజలను ఇంకా ప్రమాదం లోకి పెట్టినట్లు వుతుంది .
  • అధికారులను పునరాలోచించాలని కోరుతున్నాను.
  • ఎఎన్ఎం లు పని తప్పించుకోవడానికి అంటున్న మాటలు కావు.ప్రమోషన్ లేకుండానే రిటైర్డ్ అవుతున్న,  తమ తరువాత ఉద్యోగం లోకి వచ్చి ప్రమోషన్ తో అధికారం చెలాయిస్తున్న చెప్పింది చేసే మనస్తత్వం ఎఎన్ఎం లది

డిమాండ్లు…

కరోనా పరీక్షల డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలి

పనిభారం ను తగ్గించాలి,

2వ ఎఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి

ఎఎన్ఎం పేరు ను VHO(Village Health Officer) గా మార్పు చేయాలి

క్లినిక్ రెంట్, క్యారీయర్ అలెవెన్సు వెంటనే మంజూరు చేయాలి

ప్రమోషన్ లు కల్పించాలి.

ANM ల పనిభారం తగ్గించాలి

ప్రాణానికి తెగించి సేవలు అందిస్తున్న  సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలి.

క్యాడర్ స్టెంత్ పెంచి ప్రమోషన్స్ ఇవ్వాలి

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *