[spt-posts-ticker]

ఐసీయూను మించి ఐసొలేషన్‌

  • గంట గంటకూ మందులు, వైద్యసేవలు
  • ప్రతిరోజూ వేడి, బలవర్ధక ఆహారం పంపిణీ
  • ఉచిత వైఫైతో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు.. 
  • అధైర్యపడొద్దు.. మానసికంగా దృఢంగా ఉండాలి
  • గాంధీ నుంచి డిశ్చార్జి అయిన కరోనా రోగి అనుభవాలు

కరోనా వైరస్‌ సోకిందని ఆందోళనతో కుంగిపోవద్దని, అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ నుంచి బయటపడవచ్చని చెప్తున్నాడు వరంగల్‌ జిల్లాకు చెందిన యెన్నెంశెట్టి అఖిల్‌ (24). అధైర్యపడకుండా, మానసికంగా దృఢంగా ఉండాలని పేర్కొంటున్నాడు. 

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): మార్చి 19న లండన్‌ నుంచి వచ్చిన అఖిల్‌ కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీలోని ఐసొలేషన్‌ వార్డులో 14 రోజులపాటు చికిత్స పొందా డు. చివరకు వైరస్‌ నెగెటివ్‌గా మారడంతో బుధవారం రాత్రి డిశ్చార్జి అయ్యాడు. చికిత్స అందిన విధానం, సౌకర్యాలు, రోగుల పట్ల తీసుకున్న జాగ్రత్తలపై తన అనుభవాలను పంచుకున్నాడు. ‘కరోనా రోగులకు ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డులను మంచి ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. పేషెంట్లకు ఫోన్‌, వైఫై సౌకర్యం కల్పించారు. వార్డుల్లోని బడ్స్‌, బెడ్‌షీట్స్‌ ఎప్పటికప్పుడు మార్చుస్తున్నారు. పేషెంట్ల దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రతిరోజూ ఉదయం డ్రైఫ్రూట్స్‌ ఇవ్వడంతోపాటు, ప్యాకేజీ ఆహారాన్ని వేడివేడిగా అందించారు. తాగునీరు ప్యాకింగ్‌ బాటిల్స్‌ ఇచ్చారు. గంటకోసారి మందులు, వైద్యసేవలు అందించారు. వైద్యులు పూర్థిస్థాయి రక్షణతో వైద్యం అందించారు. గుర్తుపట్టలేనంతగా డాక్టర్లు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైఫై సౌకర్యం కల్పించడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్‌లో నిత్యం మాట్లాడుకునే అవకాశం కలిగింది. వైఫై ఉండటంతో విశ్వవిద్యాల యం నుంచి ఆన్‌లైన్‌ తరగతులను ఫాలో అయ్యాను. క్లింటన్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్టు కూడా పూర్తిచేశా’ అని పేర్కొన్నాడు.

ఎయిర్‌పోర్టు నుంచే గాంధీ దవాఖానకు

లండన్‌లోని ఎడెన్‌బర్గ్‌ వర్సిటీలో మానవహక్కుల చట్టాలపై పీజీ చేస్తున్న అఖిల్‌ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ ప్రబలినప్పటికీ గుంపులుగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న భావనతో లాక్‌డౌన్‌ విధించకుండా పబ్బులు, స్టేడియాలు, విశ్వవిద్యాలయాలు అన్ని యథేచ్ఛగా కొనసాగించారు. వైరస్‌ ఇంకా విజృంభించడంతో భారతీయ విద్యార్థులమంతా మాతృదేశానికి తిరిగి రావాలని చర్చించుకున్నాం. అదే సమయంలో మార్చి 18 నుంచి యూరప్‌, ఇంగ్లాండ్‌ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు మనదేశం ప్రకటించింది. ఎంతోప్రయత్నించగా మార్చి 17న నాకు ఒక టికెట్‌ బుక్కయింది. ఎవరినీ ముట్టుకోకుండా ప్రయాణం చేసి.. ఇండియా రాగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకున్నా. అమ్మనాన్నను, స్నేహితులను ఎయిర్‌పోర్టుకు రావద్దని సూచించా. 19న ఎయిర్‌పోర్టులో దిగగానే హెల్త్‌డెస్క్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నా. ఆరోగ్యంగా ఉండటంతో నెగెటివ్‌ వస్తుందని భావించా. కానీ పాజిటివ్‌ వచ్చింది. వ్యక్తిగతంగా హోటల్‌లో గది తీసుకొని క్వారంటైన్‌ ఉందామనుకున్నప్పటికీ.. వైద్యుల సలహామేరకు గాంధీలో చికిత్స పొందా. 14 రోజుల తర్వాత నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యా’ అని తెలిపాడు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *