[spt-posts-ticker]

కరోన వల్ల వైద్య సిబ్బందికి తప్పని తిప్పలు

కాంట్రాక్ట్ ,ఔట్సొర్సింగ్ సిబ్బంది రక్షణ కరువు

రవాణా సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందులు

జిల్లా వ్యాప్తంగా 18 టీంల ఏర్పాటు

ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): మీటరు దూరంలోనే మృత్యువు కనిపిస్తున్నది. ఏ చిన్న అవకాశం లభించినా పంజా విసరాలని కరోనా వైరస్  ప్రయత్నిస్తున్నది. గాలిదూరే సందు దొరికితే చాలు అమాంతంగా మనిషిలోపలికి చొచ్చుకుపోవాలని కాచుకొని ఉంది కరోన మహమ్మారి . అణువంతైనా లేని ఓ సూక్ష్మ క్రిమి మనవ మరణమృదంగాన్ని మోగిస్తున్నది. ఆ క్రిమిని అంతమొందించడానికి తీవ్రంగా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా  మొదలైంది. దగ్గరకు వెళ్తే తమను పట్టుకుంటుందని తెలుసు. పట్టుకుంటే వదిలిపెట్టదనీ తెలుసు. అలక్ష్యంచేస్తే అంతంచేస్తుందనీ తెలుసు. కానీ.. వెనుకడుగు వేసేది లేదు. వారి లక్ష్యం ఒకటే.. ఆ క్రిమిని  నిర్మూలించడం. తమ జాతిని సముద్ధరించడం. ఆ క్రిమి కరోనా.. దానిపై యుద్ధం చేస్తున్న సేనలు మన వైద్య బృందాలు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నిస్వార్థంగా వైద్య బృందాలు పనిచేస్తున్నయీ. దేవుళ్ళ  రూపంలో రోగులకు సేవలందిస్తున్నా వైద్యులకు, మెడికల్, పారామెడికల్ సిబ్బందికి మనం రుణపడి ఉండాలి. ….

ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న “కరోనవైరస్” నుండి ప్రజలను  రక్షించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ శాఖలో పని చేస్తున్న వైద్యులు,  మెడికల్ ,పారామెడికల్ కాంట్రాక్ట్ ,ఔట్సొర్సింగ్ సిబ్బందికికూడా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వారికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో బస్సులు ఆటోలు లేకపోవడంతో విధినిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది అలాగే ఉన్నత అధికారులు వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి రక్షణ కరువవుతోంది వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడంతో వల్ల వైరస్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మా కుటుంబ పరిస్థితి ఎలా గాని వారికి చర్చించుకోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్యులు, మెడికల్, పారామెడికల్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. 24గంటలు (రౌండ్ ది క్లాక్ ) విదులు నిర్వహించాలని అధికారులు ఉకుం జరిచేసినారు. కానీ సిబ్బందికి కావలసిన సౌకర్యాలు కల్పిచాడంలో విపలం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 18 టీంల ఏర్పాటుచేసినారు. మండల తహిసిల్దార్ , సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ఎస్ఐ ), మండల వైద్య అధికారి కలసి ప్రతి రోజు మడలంలో తిరగలి. కానీ వైద్య అధికారి మాత్రమే విదులకు హాజరై తున్నారు, కానీ మండల తహిసిల్దార్ , సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ఎస్ఐ ) వారి సబ్ అర్దినేతర్లను పంపిస్తున్నారు. తెలుస్తుంది.ఇమ్మునైజెసన్ వల్ల  ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు  రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

కరోన వల్ల వైద్య సిబ్బందికి తప్పని  తిప్పలు

ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న “కరోనవైరస్” నుండి ప్రజలను  రక్షించే వైద్యులకు, మెడికల్, పారామెడికల్ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ లో పని చేస్తున్న వైద్యులు, ఆయుస్ వైద్యులు స్టాప్ నర్స్ లు, ఫార్మ సిస్ట్, ల్యాబ్ టేక్నిసి యాన్, మొదటి, రెండవ  ఆరోగ్యకార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యముగా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అవస్తలు పడవలసి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాహనాలు లేకపోవడం అసలు సమస్య.రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విదులకు అష్టకష్టాలు పడుతూ వెళ్ళవలసి వస్తుంది.

కాంట్రాక్ట్ ,ఔట్సొర్సింగ్ సిబ్బంది రక్షణ కరువు

వైద్య ఆరోగ్య శాఖాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్సొర్సింగ్ సిబ్బంది రక్షణ కరువయిది.ఎలాంటి రక్షణ వీరికి ప్రభుత్వం ఇవ్వడంలేదు. “కరోనవైరస్” నుండి ప్రజలను  రక్షించే వైద్యులకు, మెడికల్, పారామెడికల్ , కాంట్రాక్ట్ ,ఔట్సొర్సింగ్ , ఎన్ఆర్ఎహ్ఎం సిబ్బందికి ఎలాంటి బరోసలేదు. కరోన సీజన్లో ఏమైనా జరిగితే దేవుడే దిక్కు.

ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు

ప్రతి బుదవారం , శనివారం రోజు ఇమ్మునైజెసన్ చేస్తున్నారు. దీని  వల్ల  ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు  రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇమ్మునైజెసన్ చేసే సమయంలో గర్భవతులు అయితే ఆమెతో పాటు ఎవరో ఒకరు, శిశువుకు అయితే తల్లి రావడం, కొన్ని సందర్భాల్లో ముగ్గురు ముగ్గురు రావడం జరుగుతుంది.ఈలాంటి సమయంలో తెలంగాణలోప్రభుత్వం  మాత్రం ప్రతి బుధ శనివారాల్లో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో  మహిళా ఆరోగ్య కార్యకర్తలు మాత్రం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు .ఒకే దగ్గర గుంపులు గుంపులుగా చేరడం వల్ల మాతా శిశు మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సేవ చేయడానికి వెళ్ళే మహిళా ఆరోగ్య కార్యకర్తలు మాత్రం రిస్క్  లోనే ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఆరోగ్య కార్యకర్తలతో పాటు పని చేస్తున్న రెండు కూడా ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వీరి పరిస్థితి అర్థం చేసుకోవాలి కరోన వైరస్ తగ్గేంత వరకు ఇమ్మునైజెసన్ కార్యక్రమాని అపివేదం లేక కొత్తమర్గాన్ని ఎచుకోవాలి.

జిల్లా వ్యాప్తంగా 18 టీంల ఏర్పాటు

కరోన వైరస్ పై ప్రచారం, రాకుండా ఉండేందుకు జాగ్రతలు, అనుమాన కేసులకు వైద్య పరిక్షలు లాంటివి అందిచేందుకు జిల్లా వ్యాప్తంగా 18 టీంల ఏర్పాటుచేసినారు. మండల తహిసిల్దార్ , సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ఎస్ఐ ), మండల వైద్య అధికారి కలసి ప్రతి రోజు మడలంలో తిరగలి. కానీ వైద్య అధికారి మాత్రమే విదులకు హాజరై తున్నారు, కానీ మండల తహిసిల్దార్ , సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ఎస్ఐ ) వారి సబ్ అర్దినేతర్లను పంపిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ఎస్ఐ )లు మాత్రం వారివారి టీం ద్వారా ప్రజలను బయటికు రాకుడ చూస్తున్నారు.

 

రవాణా సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందులు

కరోన వైరస్ ప్రభావం వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపాయిది. ఎక్కడి బస్సులు అక్కడే ఉండడం ప్రైవేటు వాహనాలను రోడ్డుపైకి రానివ్వకపోవడం జరుగుతుంది. ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైతం ఇబ్బందులు తప్పడంలేదు. 24గంటలు (రౌండ్ ది క్లాక్ ) విదులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినారు.విదులు నిర్వహిచేందుకు  వెళ్ళే సిబ్బందికి రవాణా సౌకర్యం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా సిబ్బందిలో  ఆడ ఆరోగ్య కార్యకర్తలు మాత్రం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఫీల్డ్ కి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే విధి నిర్వహణ కొరకు వెళ్లే వైద్య సిబ్బంది ఐడి కార్డులు లేకపోవడం పోలీసులు అడుగడుగునా ఉండడం వాళ్లకు సమాధానాలు చెప్పడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు జారీ చేసినట్లు అయితే ఇబ్బంది ఉండదు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాహనలు లేవు వాహనాలు లేకపోవడంతో వైద్యాధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జిల్లాస్థాయి అధికారులు స్పందించి కరోన సీజన్ తగ్గేంతవరకూ ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకోని ఇచ్చినట్లయితే వైద్యులు మరిన్ని సేవలు అందించే అవకాశాలు ఉన్నాయ్.  

 

  • వైద్యులకు, మెడికల్, పారామెడికల్ తోపాటు 104 108 మరియు ఆయుస్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి ,రాజీవ్ గాంధీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లో పనిచేస్తున్న  సిబ్బందికి ID కార్డులు అందించి మన సిబ్బంది విధుల నిర్వహణకు వెళ్ళినప్పుడు పోలీస్ వారి నుండి ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా SP గారినుండి ఆదేశాలు ఇప్పించాలి.

 

  • పర్సనల్ సేఫ్టీ మెథడ్స్ లో భాగంగా మన సిబ్బంది అందరికి N95 మాస్కులు మరియు గ్లౌజులు , శానీటైజర్ బాటిల్స్ అందిచాలి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *