[spt-posts-ticker]

ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం

ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం

సంగారెడ్డి : జిల్లా ప్రభుత్వ దవాఖానలో రూ.3.50 కోట్లతో కార్డియాలజీ, యూరాలజీ సేవలను ప్రారంభించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో ఖేడ్‌, అందోల్‌, జహీరాబాద్‌ లాంటి వెనుబడిన ప్రాంతాల ప్రజలు వైద్యానికి హైదరాబాద్‌కు వెళ్లలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టి జిల్లా దవాఖానలో కార్డియాలజీ, యూరాలజీ సేవలు ప్రారంభించామన్నారు. అత్యాధునికమైన మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, యూరాలజీ డాక్టర్లను నియమించామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు  సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ సేవలను అన్ని తాలూకా స్థాయి, జిల్లా దవాఖానలకు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐసీయూ సేవలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమైతే ఈ రోజు సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌లో అన్ని తాలూకా స్థాయిలో ఐసీయూ సేవలు ప్రారంభించి పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గతంలో కేవలం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో డయాలసిస్‌ సేవలు దొరికేవని, సీఎం కేసీఆర్‌ చొరవతో సింగిల్‌ యూజ్డ్‌ డయాలసిస్‌ సేవలను అధునాతన సౌకర్యాలతో తాలూకా స్థాయిలో కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ పేషెంట్లకు ఎవరి తాలూకాలో వాళ్లకు ఉచితంగా డయాలసిస్‌ సేవలను అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలందరికీ పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందజేసినట్లు చెప్పారు.  సీఎం కేసీఆర్‌ ప్రజలందరికీ హెల్త్‌ కార్డు తయారు చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు బాగా పని చేస్తున్నారని, కేసీఆర్‌ కిట్‌ వచ్చిన తర్వాత ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగాయన్నారు. సంగారెడ్డి దవాఖానలో 35 నుంచి 38 శాతం మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయని, దాదాపు 65 శాతం నుంచి 70 శాతం వరకు నార్మల్‌ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. సంగారెడ్డి దవాఖాన సంవత్సర కాలం రిపోర్టును రివ్యూ చేయడం జరిగిందని, సంవత్సరంలో ఎన్ని ఆపరేషన్లు అయ్యాయని, ఎన్ని నార్మల్‌ డెలివరీలు అయ్యాయి, మొత్తం ఎంత సంఖ్య పెరిగింది, నెల వారీగా కూడా రివ్యూలో చూశామన్నారు.

సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 8 వేలకు పైగా డెలివరీలు అయ్యాయని, అందులో 63 శాతం నార్మల్‌ డెలివరీలు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల దవాఖానలో ప్రత్యేకంగా ఒక యూనిట్‌ పెట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా, తాలూకా దవాఖానల్లో పుట్టిన పిల్లల కోసం ప్రత్యేకంగా న్యూ బార్న్‌ బేబీ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించి మెరుగైన వైద్యాన్ని అందిస్తుందన్నారు.  జిల్లా దవాఖానను రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా చూస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నక్క నాగరాజుగౌడ్‌, డాక్టర్‌ శ్రీహరి, ప్రభుగౌడ్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శ్రీకాంత్‌(నాని), జలేందర్‌రావు, ప్రదీప్‌ యాదవ్‌, జీవీ.శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, అజీమ్‌, పవన్‌ నాయక్‌, పెరుమాండ్ల నర్సింహులు, విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మనోహర్‌ గౌడ్‌, మాణిక్యం డీఎంఅండ్‌హెచ్‌వో మోజీరాం రాథోడ్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *