[spt-posts-ticker]

గర్భిణీలకు వైద్య పరీక్షలు

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దస్నాపూర్ ఉప ఆరోగ్య కేంద్రం లో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి సోమవారం గురువారం రోజు గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ సురేష్ తేలిపినారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ గర్భిణీలకు హిమోగ్లోబిన్ తో పాటు షుగర్, బిపి ,యూరిన్ ,ఎత్తు, బరువు పరిక్షలు  చేయడం జరుగుతుందని తెలిపారు .గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తల జాగ్రత్తల గురించి గర్భిణీ స్త్రీలకు ప్రతి వారం అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గర్భవతులు తీసుకోవలసిన ఆహారం వాటిలో లభించే విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్ తదితర వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య కార్యకర్తలు ముంతాజ్, పి శకుంతల, ఆశ కార్యకర్త నర్మద లు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *