[spt-posts-ticker]

తల్లి మాయతో నేత్రాలకు అరుదైన చికిత్స

హైదరాబాద్‌: కంటికి తగిలే రసాయన గాయాలు చాలా ప్రమాదకరమైనవి. చిన్న చుక్క రసాయనం పడినా.. వెంటనే చూపు కోల్పోయే అవకాశం ఉంది. కంటిలోని కార్నియా మొత్తం కుచించుకుపోతుంది. తర్వాత శస్త్రచికిత్స చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇలాంటి గాయాలకు సరోజినీదేవి ఆసుపత్రిలో అరుదైన వైద్య సేవలు అందిస్తున్నారు. తల్లి నుంచి వచ్చే మాయ(ప్లాసెంటా)లోని మెమరేన్‌ అనే పదార్థాన్ని వినియోగించి రసాయన గాయాలకు చికిత్స చేస్తున్నారు. నేత్రాలు దెబ్బ తినకుండా కాపాడుతున్నారు. ఈ చికిత్సనే ఆమ్నియాటిక్‌ మెమరేన్‌ గ్రాఫ్టు(ఏఎంజీ)గా వ్యవహరిస్తారు. కొంతకాలంగా ఈ చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ.. అవసరమయ్యే మెమరేన్‌(మాయ)ను ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి నుంచి సేకరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా  ఆసుపత్రిలోనే దీనిని నిల్వ ఉంచుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రాజలింగం, కార్నియా చికిత్స నిపుణుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పరికరాలన్నీ సమకూరాయన్నారు.

 

ఎలా చేస్తారంటే..
సరోజినీదేవి నేత్రాలయంలో ఎంతో సంక్షిష్టమైన చికిత్సలు ఉచితంగా పేదలకు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు రసాయన గాయాల చికిత్సలకు ఈ ఆసుపత్రి ప్రత్యేకంగా నిలుస్తోంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రమాదవశాత్తు కంటికి గాయాలు అవుతుంటాయి. ముఖ్యంగా కళ్లలో రసాయనాలు, సిమెంటు, సున్నం లాంటివి పడుతుంటాయి. మరికొందరిలో కంటిలో కండ పెరిగిపోవడం(టెరిజం), రెప్ప గుడ్డుకు అతుక్కుపోవడం వంటి రుగ్మతలు వస్తుంటాయి. వీటన్నిటినీ ఆమ్నియాటిక్‌ మెమరేన్‌ గ్రాఫ్టుతో సరిదిద్దుతున్నారు. ఎంతోమందికి చూపు ప్రసాదిస్తున్నారు. ముఖ్యంగా కంటిలో రసాయనాలు పడినప్పుడు కార్నియాలో భాగాలు పూర్తిగా దెబ్బతింటాయి. సమయం గడిచే కొద్ది పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కంటిని నీటితో శుభ్రంగా కడిగి ఆరు గంటల్లోపు ఆసుపత్రికి తరలించారు. ఈ తరహా బాధితులకు యాంటీ బయోటిక్‌ ఇస్తూనే.. ఆమ్నియాటిక్‌ మెమరేన్‌ గ్రాఫ్టు(ఏఎంజీ) చేస్తామని వైద్యులు వివరించారు. నైట్రో సెల్లోస్‌ పేపర్‌పై మెమరేన్‌ అతికించి ఉంటుంది. దీనిని గాయమైన చోట అత్యంత జాగ్రత్తగా అమర్చుతారు. దీంతో రసాయన గాయాలు మరింత పెద్దవి కాకుండా ఉంటాయి. ఇలా కంటి చూపును 40 నుంచి 50 శాతం వరకు రక్షించుకునే వీలుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి నుంచి మాయ వేరవుతుంది. ఇందులో రెండు పొరలు ఉంటాయి. మమెరెన్‌లో గాయాలను నయం చేసే శక్తి ఉంటుంది. ప్రతి నెలా పదికి పైనే రసాయన గాయాలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నామన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరణ..

ఆమ్నియాటిక్‌ మెమరేన్‌ గ్రాఫ్టు(ఏఎంజీ) కోసం సొంతంగా మాయను సేకరించడం శుద్ధి చేసి మమెరేన్‌ను వేరు చేస్తున్నారు. సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి దీనిని సేకరిస్తున్నారు. ఒక్కో ప్లాసెంటాతో 60 నేత్రాలకు చికిత్సలు అందించవచ్చంటున్నారు. తొలుత మాయ సేకరించి రెండు గంటల పాటు కెమికల్స్‌లో ఉంచి శుభ్రం చేస్తారు. తర్వాత మాయను కత్తిరించి అందులో అవసరమయ్యే పదార్థాన్ని నిల్వ చేస్తారు. గతంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మమెరేన్‌ కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆమ్నియాటిక్‌ మెమరేన్‌ గ్రాఫ్టు(ఏఎంజీ) శ్రస్త్రచికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.25 వేల వరకు ఖర్చవుతోంది. సరోజిని నేత్రాలయంలో పూర్తిగా ఉచితం.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *