[spt-posts-ticker]

మాతృత్వానికి.. విరామమా..?

మంచి నిర్ణయం కాదంటున్న నిపుణులు

అవగాహన లేక విరామం తీసుకుంటున్న మహిళలు

పాతికేళ్లలోపు తల్లులైన వారికి విదేశాల్లో ప్రోత్సాహకాలు

జీవితంలో స్థిరత్వం లేదనే కారణంగా మన దేశంలో వాయిదాలు..

ఈ అలసత్వం ప్రమాదకరం అంటున్న వైద్య నిపుణులు

 

మాతృత్వం ఓ వరంలాంటిది… పిల్లలు పుట్టాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు.. కానీ దానికి ఓ సరైన సమయం ఉందనే అవగాహన మాత్రం నేటితరంలో కరువవుతోంది. 20- 25 ఏళ్ల వయసు మధ్య పిల్లల్ని కంటే వారు ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆ సమయంలో పిల్లలను కనే అవకాశం ఉన్నా.. జీవితంలో స్థిరత్వం లేదనో.. ఇప్పుడే ఎందుకులే.. తర్వాత కందాం.. అనో కొంతమంది దానిని దూరం చేస్తున్నారు. ఈ అలసత్వం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

 

నాలుగేళ్లు నిండిన తర్వాత పాఠశాలకు, 11- 15 మధ్యలో రజస్వల, 18 దాటిన తరువాత వివాహం ఇలా బాలికల జీవితంలో ప్రాధాన్యం కలిగిన అంశాలకు నిర్ధిష్టమైన వయసు ఉంటుంది. అలాగే తల్లి కావడానికి కూడా సరైన సమయం ఉంటుంది. ఆ సమయంలో పిల్లలకు జన్మనివ్వగలిగితే తల్లి, శిశువు ఆరోగ్యంతో పాటు మాతృత్వాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థలు నివేదిస్తున్నాయి. కానీ కొంతమంది యువతులు అవగాహన లేమితో మాతృత్వాన్ని వాయిదా వేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఏది సరైన సమయం?

వివాహిత వయసు 20- 25 మధ్యలో ఉన్నప్పుడు గర్భం దాల్చడం వలన ఆరోగ్యవంతమైన శిశువుతోపాటు మాతృత్వాన్ని కూడా పూర్తిస్థాయిలో అనుభవించడానికి అవకాశం ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువమంది మహిళలు ఈ విషయంపై అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన వారి ఆరోగ్యంతోపాటు పుట్టే పిల్లలు ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని తెలుపుతున్నారు. ఇటువంటి నిర్ణయాలతో భావితరం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడటం తథ్యమని కూడా స్పష్టం చేస్తున్నారు.

 

నిజమే అంటున్న సర్వేలు

వివాహానంతరం ఆలస్యంగా పిల్లలు జన్మించడం తల్లిదండ్రులతోపాటు, దేశానికి కూడా నష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. స్త్రీల అండాశయంలో పరిమిత అండాలు ఉంటాయని 20- 25 సంవత్సారాల మధ్య ఇవి చాలా  శక్తివంతంగా ఉంటాయని ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని, ఆ తరువాత జన్మించే పిల్లలకు  జన్యు లోపాలు ఉండే అవకాశం ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది. ఈ సమస్య ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉందని, అక్కడ విద్యావంతులు, నగరాల్లో నివాసముండే వారికంటే గ్రామీణులు మాతృత్వాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారని తన నివేదికలో తెలిపింది.

 

దీంతో భారత భావితరం డౌన్‌సిండ్రోమ్‌ అనే వ్యాధి బారినపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. సంప్రదాయాలపై అంతగా నమ్మకంలేని ఫ్రాన్స్‌, ఇతర యూరప్‌ దేశాల వివాహితలు 25 సంవత్సరాలు లోపు గర్భం దాలిస్తే అనేక సదుపాయాలను కల్పిస్తాం… అని ప్రకటిస్తున్నాయంటే ఈ విషయానికి పాశ్చత్య దేశాలు ఎంత విలువ ఇస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. భవిష్యత్తులో డౌన్‌సిండ్రోమ్‌, ఇతర సమస్యల బారిన పడంటం కంటే ఇప్పుడు మేమిచ్చే తాయిలాలు గొప్పవేమి కాదని ఈ మధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించడం విశేషం.

 

డౌన్‌ సిండ్రోమ్‌ అంటే..?

30- 35 సంవత్సారాల మధ్య వయస్సులో గర్భం దాల్చడం వలన పుట్టే పిల్లలకు వచ్చే అరుదైన వ్యాధిని డౌన్‌ సిండ్రోమ్‌ అంటారు. సాధారణంగా గర్భం సమయంలో తల్లి, తండ్రి యొక్క 23 క్రోమోజోమ్‌ల జతలు సమానంగా ఏర్పడతాయి. కానీ ఒకోసారి 21 వ క్రోమోజోమ్‌ వద్ద ఒక జత బదులుగా ఇంకో క్రోమోజోమ్‌ అదనంగా కలుస్తుంది. దీనినే ట్రైజోమ్‌ లేదా డౌన్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది ఎక్కువశాతం 30 సంవత్సారాలు దాటినవారు జన్మనిచ్చే పిల్లల్లో అధికంగా ఉంటుంది. గుండెలో రంధ్రాలు, మానసిక పరివర్తన లేకపోవడం, వినిడిడి లేకపోవడం, ఒంటరితనం వంటి వాటితో శిశువులు బాధపడుతూ ఉంటారు.

 

చదువుకు సార్ధకత అంటూ…

కష్టపడి చదువుకున్న తమ చదువుకు సార్ధకత, జీవితంలో స్థిరత్వం, డేటింగ్‌, మాతృత్వంపై అవగాహన లేకపోవడం వంటి అంశాలతో చాలామంది మహిళలు సరైన సమయంలో వివాహం అయినప్పటికీ.. అమ్మ అనే పదానికి దూరమవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేగాక పెళ్లికు ముందు ప్రతి బాలిక తన ఆరోగ్యంపై రుతుక్రమాలపై పూర్తి శ్రద్ధ తీసుకుంటారని, వివాహం తరువాత వీటిపై పెద్దగా దృష్టిపెట్టరని వైద్యులు తెలుపుతున్నారు. సరైన సమయంలో మాతృత్వానికి దూరమైతే ఆ తరువాత ఎంత సంపాదించినా అది వృధా అవుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలతో భవిష్యత్తులో దేశానికి విలువైన సంపదలా భావించే యువశక్తి దూరమవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

 

గుంటూరు జిల్లాలోనూ అంతంతమాత్రమే..

పిల్లల విషయంలో జిల్లాలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది అనేది అందోళన కలిగించే అంశం. సాధారణంగా ప్రతి 10 జంటలకు 21మంది పిల్లలు ఉండాలి. వీరిలో ఒకరు అనారోగ్యం బారినపడినా జంటకు ఇద్దరు పిల్లలు ఉంటారు. దీనినే పొటన్షియల్‌ రేట్‌(పీఆర్‌) ఆంటారు. కానీ జిల్లాలో మాత్రం 10 జంటలకు 16 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ప్రతి 20 మందికి  నలుగురు పిల్లల కొరత అనేది ఆందోళన కలిగించే విషయం. మాతృత్వంపై అవగాహన లేకపోవడం, మేనరికాలు, ఫాస్ట్‌ఫుడ్‌లు వంటి కారణాలతో జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొందని అధికారులు తెలుపుతున్నారు.

 

వాయిదా వేయవద్దు..

ఈ రోజుల్లో పలు కారణాల వల్ల భార్యాభర్తలు 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత సంతానం కోసం ప్రయత్నించడం వలన సంతానలేమి సమస్యలు మాత్రమే కాకుండా.. పుట్టబోయే బిడ్డకు క్రోమోజోమ్ సమస్యలు వస్తున్నాయి. 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారికి పుట్టే పిల్లలకు డౌన్స్ సిండ్రోమ్ సమస్య రావచ్చు. ప్రస్తుతం లైఫ్ స్టైల్స్ మార్పుల వలన ఆడవారికి మాత్రమే కాకుండా.. మగవారికి కూడా పలు సంతాన లేమి సమస్యలు వస్తున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *