[spt-posts-ticker]

ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు

  • అందుబాటులో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
  • కొవిడ్‌-19పై రాష్ట్రం మరింత అప్రమత్తం
  • 104ను సంప్రదించిన 2,141 మంది

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిం త అప్రమత్తమైంది. అందులో భాగంగా శుక్రవారం కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా జిల్లాలవారీగా అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తారు. కమాం డ్‌ కంట్రోల్‌ పరిధిలో ఏర్పాటుచేసిన ఐదు ప్రత్యేక కమిటీలు ప్రతిరోజూ సమీక్షించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఛాతీ దవాఖానలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు, అవసరమైన వైద్య పరికరాలను, మందులు అందుబాటులో ఉంచడంపై చర్చించారు. 40 ప్రైవేట్‌ దవాఖానల్లో  ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో వైరస్‌ విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య నిపుణులతో రాష్ట్రస్థాయి రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను (ఆర్‌ఆర్‌టీ) ఏర్పాటుచేశారు.  ప్రతి జిల్లాకు 15 మందితో కూడిన ఆర్‌ఆర్‌టీలను నిర్ణయించారు. ఈ టీమ్‌లు పాజిటివ్‌ కేసులు నమోదైతే అందుకు ఆ వ్యక్తి పూర్వాపరాలు, వారి సంబంధికులు, ఇతరులను ట్రాకింగ్‌చేస్తాయి. దీంతోపాటు వైరస్‌ సోకిన వ్యక్తి పరిసరాలను మూడు కిలోమీటర్ల పరిధిలో మ్యాపింగ్‌ చేయడం, వైరస్‌ విస్తరించకుండా ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వంటి చర్యలు చేపడతాయి. కొవిడ్‌-19 అనుమాన నివృత్తికోసం వైద్యారోగ్యశాఖ ఏర్పాటుచేసిన 104 నంబర్‌కు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 2,141 మంది ఫోన్‌చేశారు.

కరోనా క్రైసిస్‌ సెంటర్‌ పరిశీలన

ప్రజారోగ్యశాఖ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్‌ కేంద్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సందర్శించారు. జిల్లాలవారీగా వైద్యారోగ్య విభాగాలకు చేరవేయాల్సిన సమాచార సామగ్రి, కరపత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలుచేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం, వచ్చినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాటుచేసుకున్న ఐదు కమిటీలకు విధివిధానాలపై చర్చించారు. ఉన్నతాధికారులు శాంతికుమారి, యోగితారాణా, అలుగు వర్షిని, ప్రీతిమీనాలు శాఖాపరంగా ఉన్నారని వీరితోపాటు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారులు శ్వేతా మహంతి, మాణిక్‌రాజ్‌, టీకే శ్రీదేవిలను పర్యవేక్షణ కోసం కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. మాస్క్‌లు అధికరేటుకు అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంధీ దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఐసొలేషన్‌ వార్డులో కొవిడ్‌ అనుమానితులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు.

‘నమస్తే కరోనా’..

కరోనాపై అసెంబ్లీ లాబీలో సరదా సంభాషణ సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విలేకరు లు ఎవరి నోట విన్నా కరోనా మాటే. కరచాలనం వద్దు ‘నమస్తే  కరోనా’ అంటూ కొందరు… ‘కరోనా మనల్ని ఏమీచేయదు.. మన ఎండలకే అది పారిపోతుంది’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘కరోనా వచ్చిందన్న కాడినుంచి ఇండ్లళ్ల కూడా పరేషాన్‌ అయింది.. మీరు బయట ఎక్కడెక్కడో తిరుగుతారు.. ఇంటికి వచ్చేముందు స్నానంచేసి రండి అని కుటుంబసభ్యులు ఆర్డరేస్తున్నారు’ అని కొందరు ప్రజాప్రతినిధులు సరదాగా వ్యాఖ్యానించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *