[spt-posts-ticker]

లక్ష కేసులైనా చికిత్స అందిస్తాం – ముఖ్యమంత్రి

  • ప్రస్తుతం 20వేల పడకలు సిద్ధం
  • ప్రజాప్రతినిధుల పనితీరు భేష్‌
  • ఏ ఒక్కరు ఆకలితో ఉండరాదు
  • స్థానిక సంస్థలకు నిధులు విడుదల
  • ప్రజల సహకారం ఇలాగే కొనసాగాలి
  • ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి

  హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో ఎంతమందికైనా కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరోనాపై యుద్ధం చేయడానికి తమ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా అమలవుతుందన్నారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపుతున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.

  లాక్‌డౌన్‌ అమలు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్‌ సోకినవారికి అందిస్తున్న చికిత్స, పేదలకు సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సంపూర్ణం గా అమలు జరుగుతున్నదని చెప్పారు, ప్రజలు సహకరిస్తున్నారన్న సీఎం.. రానున్న రోజుల్లో కూడా వారి సహకారం ఇలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

  రాష్ట్రంలో 259 కంటైన్మెంట్లు

  కరోనా వైరస్‌ సోకినవారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 259 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుచేసి, కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా కఠినచర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి టెస్టింగ్‌ కిట్స్‌ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లకు కొరతలేదన్నారు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఐదు లక్షలకు చేరుకుంటాయని, మరో ఐదు లక్షల కిట్లకు ఆర్డర్‌ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్‌-95 మాస్కులు ఉన్నాయని, త్వరలోనే ఐదు లక్షలు వస్తాయని, మరో ఐదు లక్షల తయారీకి ఆదేశాలు ఇచ్చామని కేసీఆర్‌ వివరించారు.

  కరోనాపై యుద్ధానికి సర్వసన్నద్ధం

  కరోనాపై యుద్ధానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి ప్రకటించారు. కరోనా రోగుల కో సం 20వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య లక్షకు పెరిగినా చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. వెంటిలేటర్లు, ఇతర వైద్యపరికరాలు, దవాఖానలు, పడకలు సిద్ధంగా ఉన్నాయని, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.

  ప్రజాప్రతినిధుల పనితీరు భేష్‌

  లాక్‌డౌన్‌ అమలులో, పేదలకు అందిస్తున్న సహాయాన్ని పర్యవేక్షించడంలో, ధాన్యం సేకరణలో ప్రజాప్రతినిధులు ఎంతో చొరవచూపుతూ పర్యవేక్షిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మం త్రులు నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజాప్రతినిధులు తమ పనిని ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాలు, విధానాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

  నేడు 128 మంది డిశ్చార్జి: ఈటల

  కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్‌ అవసరాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వివరించారు. ప్రస్తుత వివిధ దవాఖానల్లో 553 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని, వీరిలో ఎనిమిది మంది బుధవారం డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం ఇండ్లకు వెళ్లిపోతారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

  స్థానికసంస్థలకు నిధుల విడుదల

  లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుడా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నవారికి నగదు బహుమతిని ప్రకటించామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇప్పటికే రూ.1500 నగదును వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ పూర్తయిందన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలను, వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు వేతనాన్ని ఇప్పటికే చెల్లించామని గుర్తుచేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకుగాను ఏప్రిల్‌ నెల కోసం పంచాయతీలకు రూ.308 కోట్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు.

   

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *