[spt-posts-ticker]

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు సీబ్బంది వేతనాలు పెంచాలలి

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

– నల్ల బ్యాడ్జీలతో వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులు సిబ్బంది

జనగామ,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య సంఘాల జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల ,సిబ్బంది వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రధాన ఆసుపత్రి ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు సిబ్బంది నిరసన తెలిపారు డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డ్యూటీ డాక్టర్ బి సంతోష్ కుమార్ కు అందజేశారుఈ నిరసన కార్యక్రమానికి వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు భైరపాక శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డాక్టర్ సునీల్ కుమార్  సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజులు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 11వ పిఆర్సి లో వేతనాలు పెంచాలని అన్నారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కొత్త జిల్లా  కేంద్రాలలో ఇరవై శాతం అదనంగా ఇవ్వాల్సి ఉండగా హెచ్ ఆర్ ఏ స్లాబులు తగ్గించడం తీవ్ర అన్యాయం అన్నారు హెచ్ ఆర్ ఎ 20 శాతం పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల అంగీకారం లేకుండా బేసిక్ స్కేల్ మీద 1శాతం మినహాయించడం అప్రజాస్వామికమని అన్నారు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు ఈ హెచ్ ఎస్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ నగదు రహిత చికిత్సలు వారికి ఇష్టమైన హాస్పటల్లో చేయించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. nhm ఉద్యోగులకు పిఆర్సి నివేదిక ప్రకారం వేతనాలు పెంచాలని జీవో నెంబర్ 60 ని సవరించాలని డిమాండ్ చేశారు కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య ఉద్యోగులందరికీ అదనపు వేతనం ఇవ్వాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ స్వప్న రాథోడ్ ;డాక్టర్ స్వప్న హెడ్ నర్స్ లు ఇందిరా, రాంబాయమ్మ, స్టాఫ్ నర్స్ లు లక్ష్మి  ,కవిత, భాగ్యలక్ష్మి ,వకుల ,సిబ్బంది భాస్కర్, ప్రసాద్ శ్రావణ్ ,మణికంఠ, రాణి మల్లేష్ సిఐటియు పట్టణ కన్వీనర్ జోగు ప్రకాష్ నాయకులు బెస్లింగ్ టన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *