[spt-posts-ticker]

వైరస్‌ను తట్టుకునే శక్తిని ఇస్తున్నాం

కరీంనగర్‌(ఆరోగ్యజ్యోతి)‌: కరోనా వ్యాధికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీలేదని, ఆ వైరస్‌ కారణంగా వచ్చే ఇతర రుగ్మతలను మాత్రమే తాము అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల చెప్పారు. కరోనా సోకిన వారు ఇతర రుగ్మతలకు గురికాకుండా.. వైరస్‌ను తట్టుకొనేలా రోగనిరోధకశక్తిని పెంచే మందులు ఇస్తున్నామని, ఏ దవాఖానకు వెళ్లినా ప్రస్తుతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. కరోనా రోగికి అందించే చికిత్స విధానం,  కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఆమె తెలిపినారు . షుగర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులు, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో సహజంగానే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, వారిపై ఈ వైరస్‌ త్వరగా ప్రభావం చూపుతున్నదని చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన రోగికి అజిత్రోమైసిన్‌, హైడ్రో క్లోరోక్విన్‌, విటమిన్‌-సీ, బీ-కాంప్లెక్స్‌, ఒకెల్టామావిజ్‌, పాంటాప్రజోల్‌, లోపోనవిజ్‌, రొటినవిజ్‌ వంటి మందులు మాత్రమే వాడుతున్నామని చెప్పారు. అయితే ఇది కరోనాకు పూర్తిస్థాయి చికిత్స కాదని తెలిపారు. ఈ మందుల వల్ల వైరస్‌ పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకమైతే లేదని, అవి రోగిలో వైరస్‌ను నియంత్రించేందుకు, రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడుతాయని చెప్పారు. రోగనిరోధకశక్తిని పెంచేందుకు యాంటీబయటిక్స్‌కంటే పోషకవిలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని డాక్టర్‌ రత్నమాల చెప్పా రు. ‘బ్రౌన్‌ రైస్‌, గోధుమ పిండి, ఓట్స్‌, చిరుధాన్యాలు మొదలైనవి తినాలి. బీన్స్‌, చిక్కుడు వంటి పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్స్‌ లభిస్తాయి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలైన కాప్సికమ్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌, వంకాయ మొదలైనవి తినాలి. రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీరు తాగాలి. నిమ్మ, బత్తాయి, వంటి పుల్లని పండ్లు తీసుకోవాలి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే సీ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలైన మసాలాద్రవ్యాలు చేర్చుకోవాలి. ఇవి వ్యాధినిరోధకశక్తి సహజత్వాన్ని పెంపొందిస్తాయి’ అని వివరించారు. కరోనా సోకిన వ్యక్తికి ఇంట్లో కూడా చికిత్సనందించవచ్చని డాక్టర్‌ రత్నమాల చెప్పారు. రోగికి ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉండాలి. ఆరోగ్యవంతులైన కుటుంబసభ్యులు వారికి సేవలు అందించాలి. ఆ ఇంట్లో 55 ఏండ్లు పైబడిన వాళ్లు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, డయాబెటిస్‌, బీపీ, గుండె, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్లను, పదేండ్లలోపు పిల్లలను దూరంగా ఉంచాలి. రోగిలో అస్వస్థత, తీవ్రమైన కొత్త లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్య సహాయం పొందాలి. క్వారంటైన్‌లో ఉంటూనే జాగ్రత్తలు తీసుకున్నా ఈ కరోనా తగ్గిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి సోకితే మాత్రం వెంటనే వైద్య సహాయం పొందాలి’ అని చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *