[spt-posts-ticker]

సెకండ్ ఏఎన్ఎం సేవలు

అడవిలో 10 కి.మీ నడిచి వెళ్లిన పోలియో చుక్కలు

జయశంకర్‌ భూపాలపల్లి (ఆరోగ్యజ్యోతి):  దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం ఆదివారం జరిగింది 0 నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే బాధ్యత ఆరోగ్య కార్యకర్తలు ఇది కీలకం అయితే ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉపాధ్యాయులు అంగన్వాడి కార్యకర్తలు ఇతర ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తల దే కీలక బాధ్యత వహిస్తారు పల్స్ పోలియో రోడ్లు లేక సరిగా లేక కాలినడకన వెళ్లి పోలియో చుక్కలు వేసే గ్రామాలు మన తెలంగాణలో ఎన్నో ఉన్నాయి ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం లోని రేగుల గూడెం లో రెండవ జ్ఞానేశ్వరి గత కొంత కాలం గా విధులు నిర్వహిస్తున్నారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అడవిలో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలియో చుక్కలు వేసిన ఘనత ఆమెకే దక్కుతుంది ఇక వివరాల్లోకి వెళితే…

భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, రేగులగూడెం సబ్ సెంటర్లలో రెండవ  ఆరోగ్యకార్యకర్తగా  పనిచేస్తున్న జ్ఞానేశ్వరి.. ప్రభుత్వం తలపెట్టిన  పల్స్ పోలియో  ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలి మొదటగా ఆమెకు ఇచ్చిన గ్రామాన్ని పూర్తి చేసుకొని రెండవ మూడు రోజులు లక్ష్యాన్ని నెరవేర్చాలని ఉద్దేశంతో ఆమె పక్కనే గల మారుమూల గిరిజన గ్రామమైన మద్దిమడుగు వెళ్లాలి. రేగులగూడెం సబ్ సెంటర్ పరిధిలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉన్నా, మద్దిమడుగుకు మాత్రం ఎలాంటిరహదారిలేదు. ఎక్కడ నివసిస్తున్న  అడవి బిడ్డలకు  పోలియో చుక్కల మందు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడితే గాని పిల్లలకు పోలియో చుక్కలు వేయటం సాద్యం కాదు.  దట్టమైన అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి అక్కడి పిల్లలకు  ఏఎన్ఎం జ్ఞానేశ్వరి పోలియో చుక్కలు వేసినారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో రెండో ఏఎన్‌ఎంగా జ్ఞానేశ్వరి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కేంద్రాన్ని రేగులగూడెంలో , ఆదివారం  ఏర్పాటు చేసినారు. అదే గ్రామంలో పోలియే చుక్కలు వేసినారు . ఆదివారం వేయగా మిగిలిపోయిన పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు మంగళవారం (జనవరి 2) జ్ఞానేశ్వరికి మద్దిమడుగు ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సరైనదారికూడా లేదు.కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. దారిలో కారడివి. ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా జ్ఞానేశ్వరి వెనుకడుగు వేయలేదు. తన డ్యూటీ నిర్వర్తించాలనుకుంది.భర్త బంధువులు గ్రామ ప్రజలు ఎవరూ కూడా సహాయం లేకుండానే ఒక వీరవనిత లాగా 10 కిలోమీటర్లు అడవిలో ఒకటి నడుచుకుంటూ వెళ్లి మద్దిమడుగు వెళ్ళింది. అక్కడ 35మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసింది పని ముగించుకొని వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారులు లేదు కాలి నడకన వెళ్లడం కూడా కష్టమే కారడవిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు అయినా అదేమీ ఆమె లెక్కచేయకుండా విధి నిర్వహణ తన లక్ష్యంగా 35 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసింది. కారడివిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా ఇవేమీ ఆమె విధి నిర్వహణకు అడ్డంకి కాలేదు. ఓ మహిళా ఏఎన్‌ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి శ్రమ కన్నా విధులే మిన్న అని నిరూపించారు. విధి నిర్వహణ కోసం ఎంతో శ్రమించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జ్ఞానేశ్వరిని గ్రామస్తులు, వైద్యాధికారులు అభినందించా

దశాబ్ద కాలంగా..

దాదాపు 10 ఏళ్లుగా ఏఎన్ఎంగా సేవలందిస్తున్న జ్ఞానేశ్వరి పుట్టినిల్లు మహాముత్తారం మండలంలోని కనుకునూరు కాగా, మెట్టినిల్లు పోచంపల్లి కావడం విశేషం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం రాగానే చాలామంది తమ ప్రాంతానికి సేవలందించడం కంటే, తమ కుటుంబం బాగుండాలనే భావిస్తారు. ఉద్యోగం రాగానే పట్నం వైపు పరుగులు పెడుతుంటారు. కానీ ఈమె మాత్రం తన సేవలను పుట్టిపెరిగిన తమ ప్రాంతవాసులకే పదేళ్ళుగా అందించడం విశేషమనే చెప్పాలి.

కష్టమైనా తప్పని పరిస్థితి..

వాగులు, వంకలు, అడవులు దాటుకుంటూ సేవలందించడంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అయినా నా ప్రాంతవాసుల కోసం ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేయాలని భావించా. పుట్టి పెరిగిన ప్రాంతం కావడం, పరిచయాలు ఉండటం వల్లే వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. అయితే మద్దిమడుగు లాంటి గ్రామాలకు వెళ్లిరావడానికి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నా భర్త భాస్కర్ బాసటగా నిలుస్తుండటం వల్లే తరచూ అక్కడి ప్రజలకు సేవలందించగలుగుతున్నాను.

జ్ఞానేశ్వరి, ఏఎన్ఎం, రేగులగూడెం, మహాముత్తారం

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *