[spt-posts-ticker]

హమ్మయ్య.. అమెరికా!

  • వైర్‌స ఉధృతి, వ్యాప్తి తగ్గుముఖం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 14: కరోనా మృత్యు కోరల్లో నలుగుతున్న అమెరికాలో పరిస్థితి మెరుగవుతున్నట్లే కనిపిస్తోంది. ఓ దశలో వేల కొద్దీ మరణాలు, పాజిటివ్‌ కేసులతో ప్రమాద ఘంటికలు మోగినా.. తాజాగా ఉధృతి, వ్యాప్తి తగ్గుతోంది. దీంతో లాక్‌డౌన్‌ ఎత్తేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైర్‌సపై యుద్ధంలో నిర్ణయాత్మక పురోగతి సాధించామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ‘పాడు కాలం ముగిసింది’ అంటూ న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కొమో చేసిన ప్రకటనలు ఆశావహ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ‘దేశవ్యాప్తంగా గత వారాంతం నుంచీ కొత్త కేసులు తగ్గుతున్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీలాంటి హాట్‌స్పాట్లలో కూడా ఆస్పత్రులకు రోగుల రాక తగ్గింది. మా కఠోర వ్యూహం చక్కగా పనిచేస్తున్నదనేందుకు  ఇది నిదర్శనమని’ మీడియా సమావేశంలో ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు అసాధారణ రీతిలో పాటిస్తున్నారని దీనిద్వారా స్పష్టమవుతోందన్నారు. సాధారణ జీవనానికి అనుమతివ్వడంపై ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు.

గడువు కంటే ముందే దేశమంతా కట్టడి తొలగిపోతుందని భావిస్తున్నానని ట్రంప్‌ వివరించారు. తన చర్యల కారణంగానే యూర్‌పతో పోల్చితే అమెరికాలో మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. జనవరి చివరి వారం నుంచి చైనాతో విమాన రాకపోకల రద్దు కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా, మీడియాపైనా ట్రంప్‌ విరుచుకుపడ్డారు. చైనా పర్యవసానం ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. దానిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై అంతెత్తున లేచారు. ‘పర్యవసానం ఉండదని ఎలా అనుకొంటావు? అది నేను చెప్పను. చైనాయే తెలుసుకుంటుంది నీకెందుకు చెప్పాలి?’ అని అన్నారు.

క్రమక్రమంగా..ఈ నెల చివరి వరకు ఇంతే స్థాయిలో తీవ్రత ఉంటుందని.. అధికారులు, వైద్యులు రాజీ లేని యుద్ధం సాగించాలని కరోనాపై ఏర్పాటైన వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పిలుపునిచ్చింది. ఈ వారమూ దుర్భరంగానే గడుస్తున్నప్పటికీ హాట్‌స్పాట్లలో వైరస్‌ వ్యాప్తి నెమ్మదించడాన్ని గమనిస్తున్నామని అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంఽథోనీ ఫౌసీ విశ్లేషించారు. ఫౌసీ తొలగింపును ట్రంప్‌ కొట్టిపడేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *